జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం, రైతులు సోమవారం నుంచి ఫర్టిలైజర్ యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు చేసుకోవచ్చు. ఎరువుల విక్రయాల్లో పారదర్శకత కోసమే ప్రభుత్వం ఈ యాప్‌ను ప్రవేశపెట్టిందని ఆమె తెలిపారు. రైతులకు ఏవైనా సందేహాలుంటే మండల వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఎరువులు కొనుగోలు చేయడానికి వచ్చే రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకం తీసుకురావాలని ఆదేశించారు.