సంగారెడ్డి మాతా- శిశు సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

4చూసినవారు
సంగారెడ్డిలోని మెడికల్ కళాశాలలో బుధవారం జరిగిన సమావేశంలో కలెక్టర్ ప్రావీణ్య తల్లి-శిశు ఆరోగ్య పరిరక్షణకు వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గర్భధారణ సమయంలో సరైన వైద్య పరీక్షలు, టీకాలు, పోషకాహారం ద్వారా తల్లి, శిశువు ఆరోగ్యాన్ని కాపాడవచ్చని, సమగ్ర ప్రణాళికతో మాతృ మరణాల రేటును సున్నాకు తీసుకురావాలని ఆమె తెలిపారు.