సంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ అడిటోరియంలో ఝరాసంగం మండల ప్రజా పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ కడల రాములు ఉద్యోగ విరమణ మహోత్సవం కుటుంబ సభ్యులు, మిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. నీతి నిజాయితీలతో పనిచేసి ఆరోగ్యంగా పదవీ విరమణ పొందిన కడల రాములుకు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగంలో టైపిస్ట్ నుండి సూపరింటెండెంట్‌గా ఎదిగానని ఆయన తెలిపారు.