జిల్లాలోని 11 మున్సిపల్ ఎన్నికల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు అదనపు ఎస్పీ రఘునందన్ రావు గురువారం తెలిపారు. సమస్యాత్మక, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి, నిఘా కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు. ఎస్. హెచ్. ఓ లు ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అవసరమైన అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.