
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన
అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే ఆందోళనల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, 'పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రతిపాదన ఏదీ లేదు' అని మంగళవారం స్పష్టం చేశారు. ఏపీలో గత రెండు రోజులుగా పెరిగిన పానిక్ కొనుగోళ్లను అదుపు చేసే క్రమంలో ఈ ప్రకటన వెలువడింది. ఏప్రిల్ 29న పశ్చిమ బెంగాల్ పోలింగ్ ముగిసిన వెంటనే ఇంధన ధరలు పెరుగుతాయన్న ఊహాగానాలను మంత్రిత్వ శాఖ ఖండించింది.




