
భార్యను దారుణంగా హత్య చేసిన భర్త
TG: భార్యపై కత్తితో దాడి చేసి ఓ వ్యక్తి అతికిరాతకంగా హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జరిగింది. మణిదీప్, శిరీష దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భర్తపై శిరీష PSలో పిర్యాదు చేసింది. దీంతో భార్యపై కక్షపెంచుకున్న మణిదీప్ పోలీస్ స్టేషన్ సమీపంలో కత్తితో ఆమెపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో శిరీష అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.




