జహీరాబాద్ సబ్ డివిజన్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఏఎస్సైగా పనిచేస్తున్న నారాయణ (55) గుండెపోటుతో మరణించారు. ఈ వార్త ఆయన కుటుంబ సభ్యులను, సహోద్యోగులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. ఇంటెలిజెన్స్ విభాగంలో ఆయన సేవలు చిరస్మరణీయమని పలువురు కొనియాడారు.