మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు భార్య నీలం కవిత, ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డ్ నుంచి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సమర్పించే ముందు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నీలం కవిత మాట్లాడుతూ, ప్రజలు తనను గెలిపిస్తే మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.