కంది మండలం ఇప్పలగడ్డ తాండ గ్రామంలోని పౌరా దేవి జగదాంబ ఆలయ 19 వార్షికోత్సవ వేడుకలు మంగళవారం నిర్వహించారు. అర్చకులు అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక కార్యక్రమాలను జరిపించారు. మహిళలు గ్రామ పురవీధుల మీదుగా బోనాలతో ఉరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. కార్యక్రమంలో సర్పంచి సోనీ రాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.