మార్డి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. శనివారం సాయంత్రం కొడుకు మరణంతో మనోవేదనకు గురైన తండ్రి బొమ్మల పోచయ్య మృతి చెందారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కుమారుడు రాజు, తండ్రి మరణించిన కొద్ది గంటలకే మృతి చెందాడు. ఒకేరోజు తండ్రీకొడుకులు ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.