పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఉపాధ్యాయులకు సూచించారు. కంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం అకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ఎలా చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.