జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం కంది మండలం ఇంద్రకరణ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పదవ తరగతి పరీక్షల్లో 100 శాతం ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు కృషి చేయాలని ఆయన సూచించారు. పరీక్షలు సమీపిస్తున్నందున ఏకాగ్రతతో చదవాలని, ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి మార్కులు సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు.