కంది: ఎరువుల దుకాణం తనిఖీ చేసిన వ్యవసాయ అధికారి

0చూసినవారు
కంది: ఎరువుల దుకాణం తనిఖీ చేసిన వ్యవసాయ అధికారి
కంది మండలంలోని జుల్కల్, కాశీపూర్ గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి ఆసియా బేగం గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల్లోని ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లను ఆమె పరిశీలించారు. ఎవరైనా ఎరువులను బ్లాక్ లో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :