కంది: పదవుల కోసమే కాంగ్రెస్ నాయకుల పాకులాట

866చూసినవారు
సీడీసీ మాజీ ఛైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి కందిలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు కేవలం పదవుల కోసమే పాకులాడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పదవీ కోసమే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్‌కు అన్ని వర్గాల్లో ప్రజాదరణ పెరుగుతోందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.