శుక్రవారం కంది గ్రామంలో హనుమాన్ దేవాలయ పునః ప్రతిష్టాపన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అర్చకులు శాస్త్రోక్తంగా వేదమంత్రాల నడుమ యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో హనుమాన్ నామస్మరణ చేయడం వల్ల ఆలయం ఆవరణ మారుమోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులైన మహేందర్, బిక్షపతి, నర్సింలు, బాల మల్లేష్, రాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.