కందిలోని మైనార్టీ గురుకుల పాఠశాల (పిఎంశ్రీ పాఠశాల) విద్యార్థులు బుధవారం అనుశ్రీ హెర్బల్ యూనిట్‌ను సందర్శించి, అక్కడ తయారవుతున్న పదార్థాల గురించి తెలుసుకున్నారు. ఇండస్ట్రియల్ టూర్‌లో భాగంగా విద్యార్థులను ఈ కేంద్రానికి తీసుకువచ్చినట్లు ప్రిన్సిపల్ కవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.