రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా కంది మండలం చేర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రోడ్డు భద్రత ప్రతిజ్ఞ కార్యక్రమం జరిగింది. ఆంగ్ల ఉపాధ్యాయులు సోమశేఖర్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. రహదారి భద్రతపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యమని ప్రధానోపాధ్యాయులు వెంకట రాజయ్య తెలిపారు.