పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కంది మండల విద్యాధికారి జోగప్ప అన్నారు. కంది లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, శానిటేషన్ వర్కర్లకు శిక్షణ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు ఉంటే తొలగించాలని చెప్పారు. సమావేశంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.