తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితిలో పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన యువజన నాయకులకు కీలక పదవులు దక్కాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మెట్టు శ్రీధర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా డా. ఏర్పుల శ్రీనివాస్ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు డా. కూన వేణుగోపాలకృష్ణ చేతుల మీదుగా వీరికి నియామక పత్రాలు అందజేశారు. జాతీయ యువజన వారోత్సవాల సందర్భంగా ఈ నియామకాలు జరిగాయి. మెట్టు శ్రీధర్ పటాన్చెరుకు చెందిన ప్రముఖ సామాజిక ఉద్యమ నాయకుడు కాగా, డా. ఏర్పుల శ్రీనివాస్ జిన్నారం మండల కేంద్రానికి చెందిన దళిత బహుజన, యువజన ఉద్యమ నాయకుడు.