సంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు జి. అంజయ్య, కార్యదర్శి ఎం. మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఆత్మగౌరవం, బడుగు, బలహీన వర్గాల హక్కులు, సామాజిక న్యాయం కోసం పోరాటం చేశారని, ఆయన జీవితం నిస్వార్థ ప్రజాసేవకు, విలువలతో కూడిన రాజకీయాలకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి గొప్ప ఆదర్శమని పేర్కొన్నారు.