సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఐ డానియెల్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకున్నారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం, తెలంగాణ ఉద్యమంలో బాపూజీ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన ఆయన ఆశయాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో ఆర్ఐలు రాజశేఖర్ రెడ్డి, ఆర్ఎస్ఐలు శ్రీశైలం, అశోక్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.