రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి తెలిపారు. బుధవారం హరిదాస్ పూర్ గ్రామంలో జరిగిన 'రైతుల మధ్యకి శాస్త్రవేత్తలు' కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, సేంద్రీయ ఎరువులతో పంటలు పండించడంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఖరీఫ్ పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ పేర్కొన్నారు.