కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో శుక్రవారం పార్వతి మరకత రాజేశ్వర స్వామి దేవాలయ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో యంత్ర ప్రతిష్టాపన జరిగింది. ఈ సందర్భంగా భక్తులు "ఓం నమశ్శివాయ" అనే పంచాక్షరి నామాన్ని జపించారు.