కొండాపూర్ లోని కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని మండల ప్రత్యేక అధికారి శ్రీదేవి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి ఎలా చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు. 100 శాతం ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.