కొండాపూర్: గ్రామాల అభివృద్ధి లక్ష్యం: ఎమ్మెల్యే

516చూసినవారు
కొండాపూర్: గ్రామాల అభివృద్ధి లక్ష్యం: ఎమ్మెల్యే
గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. ఆదివారం కొండాపూర్ మండలం తీర్పులు గ్రామంలో 8 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఎన్ఆర్ఈజీఎస్ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం చర్ల గోపులారం గ్రామంలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సతీష్, మండల అధ్యక్షుడు విటల్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్