గిరిజన హక్కుల సేవా సాధనకు లాల్ సేవ డిమాండ్

1చూసినవారు
గిరిజన హక్కుల సేవా సాధనకు లాల్ సేవ డిమాండ్
సేవాలాల్ సేన ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్ నేతృత్వంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ హుస్సేన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చేవెళ్ల డిక్లరేషన్ హామీలను తక్షణమే అమలు చేయాలని, మైదాన ప్రాంత గిరిజనులకు ఐటీడీఏలు ఏర్పాటు చేయాలని, తండాలను రెవెన్యూ గ్రామపంచాయతీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. గోర్ బోలి భాషను 8వ షెడ్యూల్‌లో చేర్చాలని, గిరిజన పూజారులకు గౌరవ వేతనం అందించాలని, చట్టసభల్లో గిరిజనులకు రాజకీయ అవకాశాలు కల్పించాలని
డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్