జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కార్యకర్తలకు కృషి చేయాలని మెదక్ పార్లమెంట్ అధ్యక్షుడు ఇల్లందుల రమేష్ అన్నారు. సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.