సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని భారత నగర్‌లో కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కళ్లల్లో కారం చల్లి, కర్రలతో దాడి చేసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. ఈ కేసులో మృతుడి కుమారుడు, భార్య, సోదరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.