కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొయ్యగుట్ట తండా వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన కేతవత్ వసురం, బూరీ బాయి దంపతులు బారినపడ్డారు. ఎక్సెల్ పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో వసురం అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ బూరీ బాయిని ఆసుపత్రికి తరలించారు.