సంగారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి మహిళా సంఘాల సభ్యులకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మొత్తం 2 వేల మంది మహిళలకు చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వనిత, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, టీఎంసీ భారతి కూడా పాల్గొన్నారు.