కొండాపూర్ మండలం గొల్లపల్లిలో గత ఏడాది విద్యుత్ షాక్ తో మృతి చెందిన తండ్రి కొడుకులు చాకలి మనయ్య, వెంకటేష్ కుటుంబానికి గురువారం రూ. 10 లక్షల పరిహారం చెక్కులను టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అందజేశారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, ఏడీ వీరారెడ్డి, ఏఈ సిద్ది రాజ్, గొల్లపల్లి మాజీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.