సంగారెడ్డి పట్టణంలోని తొమ్మిదవ వార్డులో రూ. 30 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సంతోష్ పాల్గొన్నారు.