సంగారెడ్డి: కలెక్టరేట్ లో ఒడ్డె ఓబన్న జయంతి వేడుకలు

84చూసినవారు
సంగారెడ్డి: కలెక్టరేట్ లో ఒడ్డె ఓబన్న జయంతి వేడుకలు
స్వాతంత్య్ర సమరయోధుడు ఒడ్డె ఓబన్న జయంతి వేడుకలు శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు ముఖ్య అతిథిగా హాజరై ఒడ్డె ఓబన్న చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సహాయ బీసీ సంక్షేమాధికారి కె. భాగ్యలక్ష్మి, జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు లింగయ్య పాల్గొన్నారు.