సంగారెడ్డిలో గణపయ్యకు 108 రకాల ప్రసాదాలు సమర్పణ

930చూసినవారు
సంగారెడ్డిలో గణపయ్యకు 108 రకాల ప్రసాదాలు సమర్పణ
సంగారెడ్డి పట్టణంలోని సాయిమాణిక్ నగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బొజ్జ గణపతికి 108 రకాల ప్రసాదాలను సమర్పించారు. గత 15 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ 15వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమాలకు సహకరించిన వారికి సన్మానం చేశారు.

సంబంధిత పోస్ట్