పటాన్చెరు నియోజకవర్గ స్థాయిలో బుధవారం నిర్వహించిన 'గురుపూజోత్సవ సన్మాన సభ' వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. పాఠశాల విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి ప్రదర్శించిన ప్రత్యేక నృత్యాలు సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థినుల నృత్య ప్రదర్శనలను వీక్షించిన ఆహూతులు ప్రశంసించారు.