సంగారెడ్డి నియోజకవర్గంలోని కంది మండలం ఎర్ధనూర్ గ్రామంలో గత రెండు మూడు సంవత్సరాలుగా 24 గంటలూ మట్టి, కంకర, డస్ట్ వంటి మెటీరియల్ తో భారీ వాహనాలు తిరుగుతున్నాయి. ఈ వాహనాల వెనుక వచ్చే దుమ్ము వల్ల ఇళ్లల్లోకి, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ సమస్యపై ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదని శుక్రవారం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.