తాను నటించబోయే సినిమాలో ప్రేమికులకు అండగా ఉంటే పాత్రలో నటిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రేమ కథ, విద్యార్థి సమయంలో జరిగిన మూడు సంఘటనలు వేరే వాళ్ళు నటిస్తున్నారని చెప్పారు. మూడు పాత్రల తర్వాత తాను సినిమాలోకి ఎంటర్ అవుతారని పేర్కొన్నారు. పోలీసుల నిర్బంధాలకు ఎదురొడ్డి రాజకీయంగా ఎదిగిన తీరును సినిమాలో చూపిస్తున్నట్లు చెప్పారు.