అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని మహిళా శిశు దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ శాఖ సంగారెడ్డి ఆధ్వర్యంలో గురువారం సంగారెడ్డిలోని ప్రణమ్ డే కేర్ సెంటర్ మహిళా ప్రాంగణం నందు యోగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సి డిపి ఓ చంద్రకళ మాట్లాడుతూ యోగా చేయడం వలన వృద్ధాప్యంలో మానసిక ఉల్లాసం పెరుగుతుందని సమతుల్య ఆహారం తీసుకుంటూ యోగ ప్రతిరోజు చేయడం వలన మానసిక ఒత్తిడి తగ్గి మానసిక ఉల్లాసం పెరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పల్లవి వృద్ధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వయోవృద్ధులు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.