సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి: ఎస్పీ పంకజ్ సమస్యలు పరిష్కారం

2చూసినవారు
సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి: ఎస్పీ పంకజ్ సమస్యలు పరిష్కారం
సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను ఓపికగా విని ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల వివరాలను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమస్య పరిష్కారం కాకపోతే ప్రజలు నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు.

సంబంధిత పోస్ట్