రోడ్డు ప్రమాదం.. క్షతగాత్రులకు ఎస్పీ చేయూత

1502చూసినవారు
రోడ్డు ప్రమాదం.. క్షతగాత్రులకు ఎస్పీ చేయూత
గంగాపూర్ చెరువు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మానవత్వం చాటుకున్నారు. డీసీఎం, ఆటో ఢీకొన్న ఘటనను గమనించిన ఆయన వెంటనే వాహనం ఆపి సహాయక చర్యలు చేపట్టారు. క్యూఆర్టీ సిబ్బందితో కలిసి ఆటోలో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీయించారు. కాలు విరిగిన ఓ మహిళను కానిస్టేబుల్ యాదగిరి స్వయంగా ఎత్తుకుని అంబులెన్సులో చేర్చారు. ఎస్పీ, సిబ్బంది సమయస్ఫూర్తిని స్థానికులు అభినందించారు.

సంబంధిత పోస్ట్