సంగారెడ్డిలో బుధవారం జరిగిన ర్యాలీలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఆర్టీసీ కార్మికుల ఎన్నికల్లో TJMU రాష్ట్ర కార్యదర్శి అభ్యర్థి హనుమంతుకు మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహించారు. TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సంగారెడ్డి డిపో అధ్యక్షుడు తోపాజి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హనుమంతుకు మద్దతుగా గద గుర్తుకు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.