సదాశివనగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగారెడ్డి గుండెపోటుతో మృతి

163చూసినవారు
సదాశివనగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగారెడ్డి గుండెపోటుతో మృతి
సదాశివనగర్ మండలం మర్కల్ మాజీ సర్పంచ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూకంటి సంగారెడ్డి శనివారం గుండెపోటుతో అకాల మరణం చెందారు. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సంగారెడ్డి మృతి చెందడంతో కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గిరెడ్డి మహేందర్రెడ్డి తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఒక మంచి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఈ వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్