సదాశివపేట: పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

7చూసినవారు
సదాశివపేట మండలంలోని గ్రామాల్లో గురువారం పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. నంది కంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తనిఖీ చేశారు. ఎన్నికల సిబ్బందితో మాట్లాడి పోలింగ్ కోసం చేసిన ఏర్పాట్లను ఆయన అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని ఏడు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగాయని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్