డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ బుధవారం సదాశివపేటలో డివైఎఫ్ఐ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేస్తుందని ఆరోపించారు. నిరుద్యోగ సమస్యపై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.