సదాశివపేట మున్సిపాలిటీలోని 21 వార్డులో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే తమ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ కూడా పాల్గొన్నారు.