సదాశివపేట: డిగ్రీ కళాశాలలో పటేల్ జయంతి కార్యక్రమం

3చూసినవారు
సదాశివపేట: డిగ్రీ కళాశాలలో పటేల్ జయంతి కార్యక్రమం
శుక్రవారం సదాశివపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రిన్సిపల్ భారతి మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఏక్తా దివస్ గా జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు మురళీకృష్ణ, శకుంతల కూడా పాల్గొన్నారు.