సదాశివపేట మండలం ఆత్మకూరు నుంచి సింగూరు ప్రాజెక్టుకు వెళ్లే రోడ్డు మరమ్మతులకు ఏటిగడ్డ సంఘం గ్రామపంచాయతీ పాలకవర్గం బుధవారం సొంత నిధులతో శ్రీకారం చుట్టింది. 2020 నుండి గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో, పాలకవర్గం హామీ మేరకు మొరంతో రోడ్డుపై గుంతలను పూడ్చివేస్తున్నారు. ప్రజలకు అన్ని వసతులు కల్పిస్తామని సర్పంచి తెలిపారు.