విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ సూచించారు. సదాశివపేటలోని ప్రభుత్వ బాలుర బీసీ బాలుర వసతి గృహాన్ని ఆదివారం అకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం ఎలా పెడుతున్నారో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు పాఠశాల నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు.