సదాశివపేటలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు శిక్షణ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ శంకర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులు శిక్షణను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని సూచించారు. ఉపాధ్యాయుల బోధన మెరుగుపరిచేందుకే ఈ శిక్షణ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.