న్యాల్కల్ మండలంలో ఉపాధి హామీ పథకం కింద టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ బుధవారం గుండెపోటుతో మరణించారు. మంగళవారం పనులను పరిశీలించిన ఆయన, సాయంత్రం ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.